News February 22, 2025

గోల్డ్ మెడల్ సాధించిన నందలూరు విద్యార్థినీలు

image

బెంగళూరులో జరిగిన నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 సీజన్ 8 ఫైనల్స్‌లో నందలూరు విద్యార్థినీలు గోల్డ్ మెడల్ సాధించారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో 14 రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడగా.. నందలూరుకు చెందిన ఎన్. లక్ష్మీ చైతన్య, ఎస్. జైనబ్ గోల్డ్ మెడల్ సాధించారు. మెంటర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు నాలుగు నెలల పాటు శిక్షణ పొందారు.

Similar News

News November 3, 2025

ASF: చేప పిల్లల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం: మంత్రి

image

మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని నీటి వనరులలో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ (ASF) జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

image

ఈ నెల 15న నిర్వహించబోయే లోక్ అదాలత్‌పై కోర్టు న్యాయవాదులతో జనగామ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం సమావేశం నిర్వహించారు. సివిల్, మ్యాట్రిమోనియల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్‌తో లాగి పలు కేసుల రాజీ పద్ధతిపై చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.

News November 3, 2025

ANU: వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంMR ప్రారంభం కానున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ వ్యాయామ విద్య పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం సాయంత్రం తెలిపారు. పరీక్ష ఫీజు, తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.