News March 11, 2025

గోవాడను గట్టెక్కించే వారే లేరా..? 

image

జిల్లాలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యక్షంగా 24 వేలమంది రైతులు, 800 మందికార్మికులు ఆధారపడిన ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోంది. నష్టాల నుంచి ఫ్యాక్టరీని గట్టెక్కిస్తామంటూ నాయకులు హామీలిచ్చి గెలిచిన తర్వాత గాలికొదిలేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వమోచ్చినా సమస్య తీరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న గోవాడను ఇప్పటికైనా గట్టెక్కించాలని కోరుతున్నారు.

Similar News

News April 14, 2026

ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ వివరించండి: పొంగులేటి

image

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కొండంత అభివృద్ధిని కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

News April 14, 2026

మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

image

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.

News April 14, 2026

రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదు: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమన్నారు. ‘రేవంత్ చెబుతున్న <<19646674>>హైబ్రిడ్ నమూనా<<>> ఎక్కడా లేదు. TGలో ఆ విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గించి HYDకు పెంచుతారా? రాష్ట్ర ఆదాయంలో 70% HYD నుంచే వస్తోంది. అలాంటప్పుడు 70% సీట్లు HYDలోనే ఉండాలా’ అని ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.