News February 21, 2026

గోవాలో పలు బీచ్‌లను పరిశీలించిన బాపట్ల కలెక్టర్

image

బాపట్ల సముద్ర తీరాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో బృందం గోవాలో శుక్రవారం పర్యటించింది. GCZMA, బయోడైవర్సిటీ బోర్డు అధికారులతో CRZ అమలు, వ్యర్థ నిర్వహణపై చర్చించింది. Candolim Beachలో సౌకర్యాలు పరిశీలించి, Fort Aguada Jail Museumలో వారసత్వ పర్యాటక నమూనాను అధ్యయనం చేశారు.

Similar News

News February 21, 2026

దిల్‍సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు 13 ఏళ్లు

image

దిల్‍సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు పడిన శిక్షలు త్వరగా అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: ఖమ్మం డీఆర్డీవో పీడీ

image

స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.