News January 2, 2025

గోవాలో ప.గో.జిల్లా యువకుడి మృతి

image

గోవాలో తాడేపల్లిగూడేనికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాలంగూట్ బీచ్‌ కు వెళ్లారు. ఓ రెస్టారెంట్లో రవితేజ అతని మిత్రుడు సందీప్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వారి వద్ద నుంచి అధిక ధర డిమాండ్ చేయడంతో కుదరదని చెప్పారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం రవితేజపై దాడికి పాల్పడింది. దెబ్బలు తాళలేక రవితేజ మృతి చెందినట్లు సమాచారం. 

Similar News

News January 5, 2025

భీమవరం: ‘మంత్రి నారా లోకేశ్ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలి’

image

జనవరి 6న ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటింనున్నారు. లోకేశ్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News January 4, 2025

బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలి: జేసీ 

image

బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని 14 గిడ్డంగులు యజమానులతో సమావేశమై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ.. రైస్ మిల్లులో మర ఆడిన బియ్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా తగిన హామాలీలను సమకూర్చుకుని బియ్యం దిగుమతికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.

News January 4, 2025

జగన్ మోసం చేశారు: నిమ్మల

image

పోలవరం నిర్వాసితులకు 2017లోనే చంద్రబాబు రూ.800 కోట్లు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పరిధిలోని 6 గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారు. తాజాగా మేము ఒకేరోజు నిర్వాసితులకు రూ.815 కోట్లు చెల్లించాం’ అని నిమ్మల అన్నారు.