News March 26, 2024

గోవా క్యాంపు నుంచి ప్రజా ప్రతినిధుల తిరుగుముఖం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.

Similar News

News September 30, 2024

ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు

image

2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ.500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లోప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.

News September 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

❤U-19 టోర్నీ.. నల్గొండ పై పాలమూరు ఘనవిజయం
❤ధన్వాడ: 3 నుంచి రెజ్లింగ్ పోటీలు
❤3 నుంచి ఓపెన్ SSC,INTER సప్లిమెంటరీ పరీక్షలు
❤బిజినపల్లి:లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
❤కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జులై వేతనాలు విడుదల
❤నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
❤మద్యం సేవించి వాహనాలు నడపరాదు:SIలు
❤ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి:CPM
❤వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలి:BKMS

News September 30, 2024

జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న గుండె సమస్యలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. నేటి జీవనశైలితో 20-70 ఏళ్ల వారికి గుండెపోటు వస్తోంది.100 మంది రోగుల్లో 70% మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరిగాయని, చికెన్, మసాలాతో కూడిన ఆహారం తినరాదని నిపుణులు తెలిపారు. నేడు వరల్డ్ హార్ట్ సందర్భంగా ప్రత్యేక కథనం.