News February 3, 2026

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<>GSL<<>>) 25 ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/BSc(Engg.) అర్హత గలవారు FEB 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, DV, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://goashipyard.in

Similar News

News February 6, 2026

ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

image

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్‌తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్‌లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!

News February 6, 2026

బెంగాల్ ఎన్నికలు.. ఒంటరిగా బరిలోకి కాంగ్రెస్..!

image

వె.బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో 2 దశాబ్దాలుగా ఉన్న పొత్తు తెంచుకుని 2006 తర్వాత తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగనుంది. 294 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తుల కారణంగానే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం లేదని హైకమాండ్‌కు తెలిపారు.

News February 6, 2026

ప్యూర్ సిల్వర్‌ను గుర్తించడం ఎలా?

image

* ప్యూర్ సిల్వర్ అయస్కాంతానికి అతుక్కోదు.
* ఐస్ ముక్క ఉంచితే వెంటనే కరగడం మొదలవుతుంది.
* వాసన ఉండదు. ఏదైనా లోహాన్ని కలిపినప్పుడు/పూత వేసినప్పుడు రాగి లేదా మెటల్ వాసన వస్తుంది.
* శుభ్రమైన తెల్లటి వస్త్రంతో వెండి వస్తువుపై రుద్దితే నలుపు/గ్రే మచ్చలు కనిపిస్తాయి.
* నీటిలో త్వరగా మునిగిపోతుంది. నకిలీ వెండి మెల్లగా నీటి అడుగుకు చేరుతుంది.
* మరో లోహంతో కొట్టినప్పుడు క్లియర్ బెల్ సౌండ్ వస్తుంది.