News December 23, 2025

గోవిందరాజస్వామి ఆలయంపై 30 విగ్రహాలు తొలగించారు..?

image

గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న విగ్రహాలను బంగారు తాపడం పనుల నేపథ్యంలో తొలగించారు. అనేక దేవతామూర్తుల విగ్రహాలు నేడు కనిపించడం లేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై హై కోర్టులో కూడా తప్పుడు నివేదికలు సమర్పించారని అంటున్నారు. ఇదంతా ఆనాటి అధికారులు, అర్చకులు, జీయర్ స్వాములతో సహా ముఖ్యులు తెలిసే జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

వింజమూరు MPP తొలగింపు

image

వింజమూరు మండల అధ్యక్షుడు ఇనగనూరి మోహన్ రెడ్డిని తొలగిస్తూ ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 31వ తేదీన వింజమూరు మండల కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో మండలంలోని 12 మంది ఎంపీటీసీలకు గాను 11 మంది సభ్యులు ఎంపీపీపై అవిశ్వాసానికి ఓటు వేశారు. ఈ మేరకు ఎంపీపీని తొలగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

News December 23, 2025

ASF: ఇంటర్ విద్యార్థులకు చివరి అవకాశం

image

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును రూ.2 వేల అపరాధ రుసుముతో ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్ తెలిపారు. విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని, ఫీజు చెల్లించని వారు వెంటనే తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.

News December 23, 2025

215 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(<>ITI<<>>) 215 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://itiltd.in