News February 22, 2026
గోవిందరావుపేట ఎంపీడిఓ కార్యాలయంలో మంటలు

గోవిందరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని ముఖ్య ఫైళ్లు అగ్నికి ఆహుతవుతున్నట్లు సమాచారం. ఘటనతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలా? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
Similar News
News February 22, 2026
వనపర్తి: 108 అంబులెన్స్ సేవలకు కొత్త డిస్ట్రిక్ట్ మేనేజర్

వనపర్తి జిల్లా 108 అంబులెన్స్ సేవల డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా డి.రత్నమయ్య బాధ్యతలు స్వీకరించారు. అత్యవసర సమయాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. GVK EMRI ఆధ్వర్యంలోని 108, 102 సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
News February 22, 2026
నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు: DIEO నాగేశ్వరరావు

పార్వతీపురం మన్యం జిల్లాలో 33 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని DIEO నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 17,530 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 8,787 మంది, సెకండియర్‌లో 8,743 మంది పరీక్షలు రాస్తున్నట్టు వెల్లడించారు.
News February 22, 2026
విజయవాడలో పోటీపడనున్న జనసేన మంత్రి టీం Vs TDP మంత్రి టీం

ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి MLA, MLCల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లకు మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ సారధులుగా ఉండనున్నారు. క్రీడలు ఆడే వారి సంఖ్య పెరిగితే మరొక జట్టు పెరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జట్లలోని సభ్యులు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.


