News August 16, 2025
గోవిందరావుపేట: 32 ఫీట్లకు చేరిన లక్నవరం సరస్సు

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు ఉద్ధృతంగా ప్రవర్తిస్తోంది. కాగా, 32 ఫీట్లకు నీటిమట్టం చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సరస్సు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమయంలోనైనా మత్తడి పొంగే అవకాశం ఉందని, సరస్సులో మత్స్యకారులు, స్థానిక ప్రజలు దిగరాదన్నారు.
Similar News
News August 16, 2025
పెగడపల్లి: సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా భూమేశ్వర్

జగిత్యాల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శిగా పెగడపల్లి మండలం కీచులాటపల్లికి చెందిన ఇరుగురాల భూమేశ్వర్ నియమితులయ్యారు. శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో భూమేశ్వర్‌ను పార్టీ నాయకులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొంటూ, తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
News August 16, 2025
గుంటూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

గుంటూరులోని సాయిబాబా నగర్‌లో దారుణం జరిగింది. నరసరావుపేటలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు మగ పిల్లలను తీసుకుని శనివారం సాయిబాబా నగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 16, 2025
మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన

భారీ వర్షాల కారణంగా మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం సందర్శించారు. మంచిర్యాలలోని రాళ్లవాగు, లక్షెట్టిపేట పరిధిలోని గంపలపల్లి, కొమ్ముగూడెం, గోదావరి నది పరీవాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు, ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ శాఖలతో సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.