News November 21, 2025
గోవింద కోటితో శ్రీవారి VIP బ్రేక్ దర్శనం

యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, సనాతన ధర్మంపై అనురక్తి కల్పించడమే లక్ష్యంగా TTD కీలక నిర్ణయం తీసుకుంది. రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు VIP దర్శనాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 1,00,01,116 సార్లు రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.
Similar News
News November 22, 2025
పల్నాడు: సాగర్–శ్రీశైలం లాంచీ సర్వీసులు ప్రారంభం

మాచర్ల మండలం నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచీ సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పర్యాటకశాఖ నేటి నుంచి సర్వీసులు ప్రారంభిస్తోంది. పెద్దలకు వన్‌వే రూ.2వేలు, రెండు వైపులా రూ.3250. 5–10 ఏళ్ల పిల్లలకు ఒకవైపు రూ.1600, రిటర్న్ రూ.2600గా నిర్ణయం. టికెట్ల కోసం పర్యాటకశాఖ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
News November 22, 2025
యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.
News November 22, 2025
హుజురాబాద్‌లో దూరవిద్య తరగతులు ప్రారంభం

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు దూర విద్యా తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఇందిరా దేవి, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు.


