News January 15, 2025
గోసాల ప్రసాద్ మృతి

ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News February 25, 2026
గోకవరం: ఏడో తరగతి బాలికను వేధించిన యువకుడి అరెస్ట్

గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను వేధించిన కాళ్ల రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు SI తెలిపారు.
News February 24, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఏడుగురి పరిస్థితి విషమం

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొందరిని వెంటిలేటర్, డయాలసిస్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
News February 24, 2026
241 రిపోర్టులు వచ్చాయి.. రాజమండ్రి మరణాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు!

రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ వైఫల్య ఘటనల నేపథ్యంలో ఎంపీ పురందీశ్వరి మంగళవారం మెడికల్ క్యాంపును పరిశీలించారు. కలుషిత పాలు తాగి నలుగురు మరణించడం, చిన్నారులకు డయాలసిస్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు. మొత్తం 293 మంది నుంచి శాంపిళ్లు సేకరించగా, 241 రిపోర్టులు అందాయని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


