News March 7, 2025
గౌతాపూర్ మాజీ సర్పంచ్ మృతి

బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
Similar News
News March 9, 2025
గిగా కంపెనీతో పాలమూరు రూపురేఖలు మారతాయి: కేంద్ర మంత్రి

అమర్ రాజా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా రూ.3,225 కోట్లతో నిర్మిస్తున్న గిగా ఫ్యాక్టరీతో పాలమూరు రూపురేఖలు మారడం ఖాయమని కేంద్ర రైల్వే శాఖ సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో కంపెనీ ప్రారంభం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ప్లాంటును పరిశీలించారు.
News March 8, 2025
నేడు పాలమూరుకు కేంద్రమంత్రి రాక

కేంద్ర రైల్వే, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు MBNR జిల్లాకు రానున్నారు. స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి జిల్లాలో పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు దివిటిపల్లిలోని అమరరాజు బ్యాటరీ కంపెనీ ఏర్పాటుకు నిర్వహించే భూమి పూజలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొంటారని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు.
News March 8, 2025
MBNR: క్రమబద్ధీకరణతో ప్రజలకు లబ్ధి చేకూర్చండి: ప్రిన్సిపల్ సెక్రటరీ

అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు లబ్ధి కల్పించేలా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ఎల్ఆర్ఎస్ పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీలో ప్రచారం చేపట్టాలన్నారు.