News December 22, 2025
గౌరు చరితకు అనుకోని అవకాశం

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి అనూహ్యంగా దక్కింది. సుమారు 12 మంది నేతలు పోటీ పడగా ఒక దశలో ధర్మవరం సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఆఖరి నిమిషంలో చరితకు అవకాశం దక్కింది. మరోవైపు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు చరితను నియమించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Similar News
News December 27, 2025
పుట్టిన రోజులకూ జంతు బలి.. ఏంటీ సంస్కృతి?

ఏపీలో ‘జంతు బలి’పై అధికార, విపక్షాల మధ్య <<18686511>>మాటల<<>> యుద్ధం కొనసాగుతోంది. మీవారే చేశారంటే.. మీవాళ్లూ చేశారంటూ TDP-YCP విమర్శలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో జంతుబలిపై నిషేధం ఉంది. అయినా పండగలు, జాతరల సందర్భంగా బలిస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తుల పుట్టినరోజులకూ వాటిని బలివ్వడం ఆందోళనకు గురి చేస్తోందని జంతు ప్రేమికులు అంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. మీరేమంటారు?
News December 27, 2025
జూన్ నాటికి ‘యంగ్ ఇండియా’ సిద్ధం కావాలి: కలెక్టర్

నల్గొండ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్న ఆమె, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జూన్ నుంచి ఈ పాఠశాలలో తరగతులు ప్రారంభించేలా నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని అన్నారు.
News December 27, 2025
‘రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు’

వేములవాడకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రాజన్న ఆలయ ఈవో ఎల్. రమాదేవి తెలిపారు. శనివారం సాయంత్రం ఆలయ అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆలయ వసతిగదులు, క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు, ప్రసాదాల తయారీ విభాగం తదితరులు పరిశీలించారు. భక్తులకు వసతి సౌకర్యం మెరుగుపరుస్తామని, స్వామివారి దర్శనం త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.


