News April 2, 2025

గ్యాంగ్ రేప్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

image

ఊరుకొండ పేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మహిళల భద్రత అంశం ఆందోళన కలిగిస్తోందని BRS నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేర స్థలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కాగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

Similar News

News April 3, 2025

మహబూబ్‌నగర్: GREAT.. ప్రజల కోసం రూ.లక్ష  

image

మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలమూరు వాసులు మద్ది అనంతరెడ్డి, మద్ది యాదిరెడ్డి కలిసి జిల్లా ఎస్పీ జానకికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం చెక్కును ఎస్పీకి అందించారు. పట్టణంలో భద్రతను పెంపొందించేందుకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. 

News April 3, 2025

మహబూబ్‌నగర్ బిడ్డలు తగ్గేదేలే: MLA

image

విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలో బుధవారం ఆయన నీట్, ఎంసెట్ కోర్సులో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో నీట్, ఎంసెట్ కోర్స్‌ను అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ బిడ్డలు ఎందులోనూ తక్కువ కాదని, ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారని ఆయన అన్నారు.

News April 3, 2025

‘మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి’

image

మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కుమారస్వామిని ఢిల్లీలో బుధవారం కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ కుమార్ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి బుధవారం ఆయన వినతిపత్రం ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

error: Content is protected !!