News February 24, 2025

గ్యాస్ పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు: జేసీ

image

దీపం పథకం కింద సరఫరా చేస్తే గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి హెచ్చరించారు. కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే విచారణ నిర్వహిస్తామన్నారు.

Similar News

News February 24, 2026

జనగాం: ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

image

జనగామ జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని మాట్లాడుతూ.. ఈనెల 28లోపు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల లబ్ధి పొందేందుకు ఈ నమోదు అవసరమని తెలిపారు. ఇంకా నమోదు చేయని రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలు, రైతు వేదికలు, ఏఈవోలు లేదా మీసేవ కేంద్రాలను సంప్రదించాలని కోరారు.

News February 24, 2026

VZM: మార్చి 8న గురుకుల పాఠశాల్లో ప్రవేశ పరీక్ష

image

విద్యా సంవత్సరంలో ఏపీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 6-10వ తరగతులకు మార్చి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.మాణిక్యం తెలిపారు. 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్ష యధావిధిగా మార్చి1న జరుగుతుందన్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్‌టు పరీక్షలు ఉన్న కారణంగా 6, 7, 8, 9, 10వ తరగతులకు మార్చి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు ప్రకటించారు.

News February 24, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. BHEL, లింగంపల్లి, పటాన్‌చెరు, బాచుపల్లి, నిజాంపేట్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో మరో గంటలో వాన పడుతుందని తెలిపారు. ఆ తర్వాత మాదాపూర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వివరించారు. మరి మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.