News October 12, 2025

గ్యాస్ లీక్ ఘటనలో ముగ్గురి మృతి

image

వెల్దుర్తి మండలం బోయనపల్లెలో గత ఆదివారం గ్యాస్ లీకై మంటలు వ్యాపించిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నాగరాజు, ఆయన భార్య సువర్ణ, పిల్లలు చరణ్, అనిల్‌ తీవ్ర గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఉదయం నాగరాజు, అదే రోజు రాత్రి చరణ్ మరణించారు. శనివారం మధ్యాహ్నం వారి అంత్యక్రియలు జరుగుతుండగానే గర్భిణి సువర్ణకు అబార్షన్ అయ్యింది. అనంతరం ఆమె కూడా మరణించింది. అనిల్ చికిత్స పొందతున్నాడు.

Similar News

News October 12, 2025

శ్రీ రాంసాగర్‌ నీటిమట్టం 80.053 TMCలు

image

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గడంతో ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 TMCలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 80.053 టీఎంసీలు(1090.90 అడుగులు)గా నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా 5000, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. FFC అలీ సాగర్, గుప్తా ఎత్తిపోతలలకు నీటి విడుదలను నిలిపివేశారు.

News October 12, 2025

ప్రొద్దుటూరు: నకిలీ మద్యం ఇలా గుర్తించండి.!

image

స్కాన్ చేసి నకిలీ మద్యాన్ని గుర్తించొచ్చని పొద్దుటూరు ఎక్సైజ్ సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. APTATS యాప్ ప్లేస్టోర్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ల మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తయారీ వివరాలు వస్తాయన్నారు. ఆ మద్యం బాటిల్ ఒరిజినలా? నకిలీనా? అనే సమాచారం తెలుస్తుందన్నారు. ప్రొద్దుటూరులో దుకాణాల్లో నకిలీ మద్యం లేదన్నారు.

News October 12, 2025

సుంకేసుల మూడు గేట్లు ఓపెన్

image

రాజోలి మండలంలోని సుంకేసుల బ్యారేజీ మూడు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం బ్యారేజీకి ఇన్ ఫ్లో 15,250 క్యూసెక్కులు వస్తోంది. గేట్ల ద్వారా 11,156 క్యూసెక్కులు, కేసీ కెనాల్ ద్వారా 2,445 క్యూసెక్కులు, మొత్తం 13,601 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.