News March 19, 2026
గ్యాస్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: రిజ్వాన్ బాషా

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు నూతన నిబంధనలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు.
Similar News
News April 5, 2026
HYDలో IPL మ్యాచ్.. నేడు డబుల్ ధమాకా

IPLలో నేడు 2 మ్యాచులు జరగనున్నాయి. 3.30PMకి హైదరాబాద్ వేదికగా SRH, LSG తలపడనున్నాయి. 7.30PMకి బెంగళూరులో CSK, RCB మ్యాచ్ జరగనుంది. HYD పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని, భారీ స్కోర్ నమోదయ్యే అవకాశముందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు బెంగళూరు పిచ్ పేసర్లకు హెల్ప్ అవుతుందని, 200 రన్స్ చేస్తే మంచి స్కోర్ అవుతుందని అంచనా. ఈరోజు LSG, CSK బోణీ కొడతాయా లేదా SRH, RCB మరో విక్టరీ సాధిస్తాయో చూడాలి.
News April 5, 2026
సిద్దిపేట: మెగా జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ చేసుకోండి

సిద్దిపేట జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో “సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర” పేరుతో ఒక భారీ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ ముందడుగు కార్యక్రమం ద్వారా జిల్లాలోని అర్హులైన యువతీ యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. Q ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషచేసుకోవాలన్నారు.
News April 5, 2026
తిరుమలలో ఈ విషయం మీకు తెలుసా.?

తిరుమలలో శ్రీవారి ఆరాధనలు వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. 650 ఏళ్ల క్రితం స్వామి వారు అర్చకుని కలలో ప్రత్యక్షమై మలయప్ప కోనలోని విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులుగా ప్రతిష్ఠించాలని ఆజ్ఞాపించారట. గుహలోని ఆ విగ్రహాలు ఆశ్చర్యకరంగా కాంతివంతంగా ఉండేవట. అప్పటి నుంచి మలయప్ప స్వామి ప్రతిరోజూ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తిరుమలలో ప్రతి రోజు ఊరేగే ఏకైక దేవుడు మలయప్పే కావడం విశేషం. <<19569854>>NEXT<<>>.


