News April 26, 2024
గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ గురువారం రిలీజ్ అయింది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 గడువు కాగా పోలింగ్ మే 27న జరగనుంది. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Similar News
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News April 23, 2025
ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.
News April 23, 2025
KMM: ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందొద్దు: DEO

జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయని, కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DEO సోమశేఖర్ వర్మ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజును పట్టించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఫెయిల్ అయ్యామని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించి సరైన సూచనలు ఇవ్వాలని కోరారు.