News December 30, 2024

గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు ఖమ్మం జిల్లా

image

గ్రానైట్ పరిశ్రమకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరని, దీని అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆదివారం ఖమ్మంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ జిల్లా నుంచే ఢిల్లీలో ఉన్న పోలీస్ జాతీయ స్మారక మ్యూజియానికి, ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రానైట్‌ను అందజేయడం జరిగిందన్నారు.

Similar News

News January 2, 2025

నేడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించాలని సూచించారు.

News January 1, 2025

ఖమ్మం: ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.20,506

image

ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు అదృష్టయోగం పట్టింది. ఆయిల్‌పామ్ గెలల ధర మూడు నెలలకు భారీగా పెరిగింది. టన్ను గెలల ధర అక్టోబర్‌లో రూ.19,140 వరకు ఉంది. ఇది నవంబర్, డిసెంబర్ నెలలకు రూ.20,413 వరకు పెరిగింది. ఈ నెలలో(జనవరి) పామాయిల్ టన్ను ధర రూ.20,506గా నిర్ణయిస్తూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రకటించారు. గత మూడు నెలలుగా ఆయిల్‌పామ్ ధర పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు.

News January 1, 2025

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు.