News January 25, 2025

గ్రామసభలో చదివిన పేర్లు దరఖాస్తుదారులవే: ASF అడిషనల్ కలెక్టర్

image

గ్రామ సభలో చదివిన పేర్లు దరఖాస్తుదారుల మాత్రమే అర్హుల జాబితా కాదని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కైర్గావ్ గ్రామంలో ఎంపీడీవో శంకరమ్మ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ఇది దరఖాస్తుదారుల జాబితా మాత్రమే అని అర్హులది కాదన్నారు. జాబితాలో పేరు లేని వారు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.

Similar News

News November 9, 2025

తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బృందం రానట్టేనా?

image

పంట నష్టంపై అంచనా వేసేందుకు APలో ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 8 మంది అధికారులు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఆగస్టులో ₹10వేల కోట్లు, ఇటీవలి తుఫానుతో ₹5వేల కోట్లు నష్టపోయినట్లు TG ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. కానీ దీనిపై కేంద్రం స్పందించలేదు. కనీసం బృందాన్నీ పంపడం లేదు. దీంతో కేంద్రం మరోసారి తెలంగాణకు మొండిచేయి చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.

News November 9, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

✦ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్
✦ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం: సినీ వర్గాలు
✦ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘దురంధర్’ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల.. బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్
✦ సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాకు 2 రోజుల్లో రూ.2.91కోట్ల కలెక్షన్స్

News November 9, 2025

అవనీ లేఖరాకు మరో స్వర్ణం

image

2025 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో షూటింగ్‌లో అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం సాధించారు. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె తర్వాత షూటింగ్‌కు మళ్లారు. రెండు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్‌గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.