News January 25, 2026
గ్రామస్థాయిలో జగన్ సైన్యం సిద్ధం చేస్తున్నాం: పూజిత

గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా గ్రామ స్థాయి నుంచి జగన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. శనివారం నెల్లూరు గాంధీనగర్‌లో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారం లేకపోయినా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని కొనియాడారు.
Similar News
News February 11, 2026
రేపే నెల్లూరు జిల్లాకు షర్మిల రాక

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
News February 11, 2026
శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.
News February 11, 2026
నెల్లూరు బాలాజీలో లక్కీ డ్రా

సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బాలాజీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లక్కీ డ్రా నిర్వహించింది. మొదటి బహుమతిగా నెల్లూరుకు చెందిన సత్యనారాయణ, నేలటూరుకు చెందిన నాగేశ్వరరావుకు స్కూటీలను అందజేసింది. అలాగే ఆరో స్థానం వరకు నిలిచిన వారికి ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీలు, కుక్కర్లను పంపిణీ చేసింది. సంస్థ ఛైర్మన్ YD బాలాజీ చౌదరి, CEOలు సాయి నిఖిలేశ్, సాయి నితీశ్, డైరెక్టర్ రవినాయుడు పాల్గొన్నారు.


