News January 31, 2025

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తా: ధర్మశ్రీ

image

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో గ్రామస్థాయి నుంచి వైసీపీని బలోపేతం చేస్తానని నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు స్వీకరించిన కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం కశింకోటలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందని అన్నారు. ధర్మశ్రీని మాజీ మంత్రులు బొత్స, అంబటి, గుడివాడ, ముత్యాల నాయుడు తదితరులు అభినందించారు.

Similar News

News September 19, 2025

ఆసిఫాబాద్‌లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసిఫాబాద్ మండలం సామెల తుంపల్లికు చెందిన ఆత్రం వర్ష అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 16న తన పుట్టింటి నుంచి వచ్చిన ఆమె తుంపల్లి ఆటో స్టాండ్ వద్ద ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వర్ష భర్త భగవంత్ రావు గురువారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News September 19, 2025

VZM: స్పీకర్‌తో మహిళ ప్రజా ప్రతినిధుల భేటీ

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశాల ప్రాధాన్యం, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై వారు చర్చించారు. సభా కార్యక్రమాలు విజయవంతంగా సాగేలా సహకారం అందిస్తామని తెలిపారు.

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.