News November 8, 2025

గ్రామాల్లో ఇళ్లులేని పేదలకు గుడ్‌న్యూస్

image

AP: గ్రామాల్లోని పేదలకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. NOV 5న గడువు ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈనెల 30 వరకు పొడిగించింది. లబ్ధిదారుల ఎంపికను కేంద్రం ఆవాస్+ యాప్‌లో చేపడుతోంది. అర్హులు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సాయంతో యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణానికి రూ.2.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది.

Similar News

News November 8, 2025

గర్భిణులు-తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

image

మహిళలు ప్రెగ్నెన్సీ ముందు, తర్వాత కొన్నిటీకాలు తీసుకోవాలి. వీటివల్ల తల్లీబిడ్డకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత HPV, DPT, హెపటైటిస్ బి, కోవిడ్, రెస్పిరేటరీ సిన్సీపియల్ వైరల్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొందరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు సూచిస్తారు.

News November 8, 2025

ఇవాళ్టి బంగారం, వెండి ధరలిలా

image

రెండో శనివారం సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉంది. అటు వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,850గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ. 1,65,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 8, 2025

‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

image

క్యాలెండర్‌లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.