News August 27, 2025

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పట్టిష్ఠ చర్యలు: కలెక్టర్

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పంచాయతీ శాఖపై సమీక్షలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయడం, కోర్టు కేసులకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం, అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ, ఓటర్ లిస్ట్ అప్‌డేట్ చేయడం వంటి అంశాలపై డాక్యుమెంట్ ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, డీపీఎల్ఓలు, ఎంపీఎల్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 27, 2025

HYD: పెండింగులో కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు!

image

HYDలో వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 15వేలకు పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు.

News August 27, 2025

నల్గొండ: గణనాధుడికి ఘనంగా పూజలు

image

నల్గొండ ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని రామాలయంలోని మొదటి గణేశ్‌ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

News August 27, 2025

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: KMR కలెక్టర్

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వరదల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండాయని, ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణాలు మానుకోవాలని, వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, చేపల వేటకు, పొలాలకు వెళ్లవద్దని కోరారు.