News November 20, 2025

గ్రామాల దేవాలయాలకు సోలార్ భద్రత: చిలుకూరు అర్చకుడు

image

సీఎస్ఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు, దేవాలయాల భాగస్వామ్యానికి కొత్త దారిని చూపుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ ముందడుగు వేశారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో 60 సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను అందించారు. వీటిని ఎస్బీఐ, యూబీఐ సంయుక్తంగా అందజేశారు. ఇలాంటి రిమోట్ సర్వైలెన్స్ సొల్యూషన్లను సీఎస్ఆర్‌కు అనుసంధానించడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొ న్నారు.

Similar News

News November 22, 2025

SKLM: ఆర్టీసీ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీసులు బేష్

image

శ్రీకాకుళం జిల్లా RTC సంస్థ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీస్ సేవలు భేష్ అని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. సేవలందించిన రెండు ఏజెన్సీలు నిర్వాహకులను శనివారం స్థానిక కాంప్లెక్స్‌లో ఆయన అభినందించారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల పార్సిల్లను ఎంత దూరమైన అందించే సేవలో ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. DMలు నరసింహుడు, శర్మ, ఎంపీరావు పాల్గొన్నారు.

News November 22, 2025

డ్రగ్స్-టెర్రర్ లింక్‌‌ను నాశనం చేయాలి: మోదీ

image

డ్రగ్స్-ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసిరావాలని జీ20 సమ్మిట్‌లో PM మోదీ పిలుపునిచ్చారు. SAలోని జొహనెస్‌బర్గ్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సవాలుగా తీసుకోవాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ వంటి వాటి వ్యాప్తిని అరికట్టడం, డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కొనేందుకు సహకరించుకోవాలని ప్రతిపాదించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను బలహీనపర్చేందుకు కృషి చేయాలన్నారు.

News November 22, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీంతో రేపు ప్రకాశం, NLR, KDP, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వరి కోతల టైం కావడంతో ధాన్యం కుప్పలు వేసుకోవాలని, రంగుమారకుండా ఉండేందుకు టార్పాలిన్లతో కప్పి ఉంచాలని రైతులకు సూచించింది.