News December 9, 2025
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హమీ పథకం కీలకం: మంత్రి కొండపల్లి

MGNREGS పనుల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఛాంబర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం కీలకమని ఆయన పేర్కొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్థితిని అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పీడీ శారదాదేవి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రత్నకుమార్, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
VZM: 26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News April 13, 2026
200 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు: ఎస్పీ

మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు వేసినట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహన చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.