News November 6, 2025
గ్రాముకు రూ.9వేల లాభం

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్‌లైన్‌లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.
Similar News
News April 14, 2026
వేటకు విరామం.. త్వరలో అకౌంట్లోకి రూ.20,000

AP: నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగనుంది. చేపల పునరుత్పత్తికి వీలుగా ఏటా ఈ విరామాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 61 రోజులపాటు వేటకు దూరంగా ఉండే మత్స్యకారులు ఇబ్బంది పడకుండా త్వరలో రూ.20వేల చొప్పున అకౌంట్లలో జమ చేయనుంది. ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది దాదాపు 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది.
News April 14, 2026
మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్‌కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
News April 14, 2026
నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.


