News January 20, 2026

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలి: మంత్రి

image

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా నూతన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదులని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.

Similar News

News February 20, 2026

కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

image

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.

News February 20, 2026

ఇల్లు తుడిచే నీళ్లలో ఉప్పు ఎందుకు వేయాలి?

image

ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కలిపితే ఇంట్లోని ప్రతికూల తరంగాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఉప్పులోని రసాయన గుణాలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. వాస్తు పరంగా ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, దారిద్ర్యాన్ని పోగొడుతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీలైతే ప్రతిరోజు లేదా కనీసం మంగళ, శుక్రవారాల్లో ఇలా చేయాలి. తద్వారా ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి’ అంటున్నారు.

News February 20, 2026

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

image

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై గ్రూప్‌లో కొత్తగా చేరిన వారు అంతకుముందు జరిగిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చు. అడ్మిన్లు లేదా సభ్యులు గత 25 నుంచి 100 మెసేజ్‌లను వారికి షేర్ చేయవచ్చు. ఇది పూర్తి సురక్షితమైన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పనిచేస్తుంది. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్‌లోని అందరికీ ఇది తెలుస్తుంది. అడ్మిన్లు ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.