News December 13, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 14, 2025
త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
News December 14, 2025
నల్గొండ జిల్లాలో తొలి ఫలితం

నిడమనూరు మండలం వెంగన్నగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సలాది నాగమణి నాగరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొండారి నాగజ్యోతి చంద్రశేఖర్ మీద 87 ఓట్ల తేడాతో వారు విజయం సాధించారు. తమ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని నాగమణి తెలిపారు.
News December 14, 2025
నల్గొండ: బీసీల ఖాతాల్లోకి 49 శాతం సర్పంచ్ స్థానాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు ఆధిపత్యం చూపారు. మొత్తం 630 సర్పంచ్ స్థానాల్లో 308 చోట్ల బీసీలు గెలుపొందారు. వీటిలో 140 బీసీ రిజర్వ్ స్థానాలు కాగా, జనరల్ కేటగిరీలోనూ 158 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. ఎస్సీలు 138, ఎస్టీలు 91, ఓసీలు 93 స్థానాల్లో గెలిచారు. బీసీలకు 49 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి.


