News December 31, 2025
గ్రీటింగ్ కార్డ్స్ ❤

న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని ఫ్రెండ్స్‌కు విషెస్ చెబుతూ పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..
Similar News
News December 31, 2025
KMR: విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

కామారెడ్డి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని కూడళ్లలో ముఖ్య ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
News December 31, 2025
జగిత్యాల: విద్యా దీవెన దరఖాస్తులు మార్చి 31 వరకు

జగిత్యాల జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులపై జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ 31 మార్చి 2026 కాగా, దరఖాస్తులు E-PASS వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.
News December 31, 2025
9 మందికి రూ.18 లక్షల పింఛన్లు అందజేసిన మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం హయాంలో ఆగిన 9 మందికి రూ.18 లక్షల పింఛన్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలో అందించారు. నందిగామ మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన వీరికి మధ్యలో ఆగిపోగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం మంజూరైన పెన్షన్లను అందజేశారు. RDO కృష్ణమూర్తి, మాజీ పీఎసీఎస్ ఛైర్మన్ వరప్రసాద్, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ ఉన్నారు.


