News December 31, 2025

గ్రీటింగ్ లింకులతో ‘జర భద్రం’: వరంగల్ సీపీ

image

నూతన సంవత్సర వేడుకల వేళ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. న్యూ ఇయర్ విషెస్ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని కోరారు. ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ లింక్ ల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము దోచేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సీపీ కోరారు.

Similar News

News February 21, 2026

టెన్త్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: DEO

image

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ పిలుపునిచ్చారు. శనివారం పోడూరులోని క్లస్టర్ కాంప్లెక్స్‌లను ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సూర్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News February 21, 2026

రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

image

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

News February 21, 2026

ఉమ్మడి మెదక్: ఏప్రిల్ 10 నుంచి SA-II పరీక్షలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు సమ్మేటివ్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమగ్రంగా సన్నద్ధం కావాలని, ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు.