News January 19, 2026

గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

image

గ్రీన్‌లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్‌అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.

Similar News

News February 8, 2026

ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.

News February 8, 2026

రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

image

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.

News February 8, 2026

గోవా వెళ్తున్నారా? ఈ పని చేస్తే 24 గంటలు జైలులో ఉండాల్సిందే

image

గోవాలో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలు జైలులో గడపాల్సిందే. పర్మిషన్ లేకుండా విదేశీయులు/ఇండియన్స్ ఫొటోలు తీసినా, సెల్ఫీలకు వేధించినా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల నిర్ణయంపై SMలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నార్త్ గోవా బాగా బీచ్‌లో టూరిస్టులను వేధించిన తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.