News January 17, 2026
గ్రీన్‌లాండ్ విషయంలోనూ టారిఫ్ అస్త్రం

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. గతంలో టారిఫ్ బెదిరింపులతో యూరప్ దేశాలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే వ్యూహాన్ని గ్రీన్‌లాండ్ విషయంలోనూ అమలు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
Similar News
News April 14, 2026
మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్‌కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
News April 14, 2026
నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.
News April 14, 2026
ప్రేమ కోసం పోరాడే గ్యాంగ్‌స్టర్‌గా ‘సైయారా’ హీరో

గతేడాది <<17590211>>‘సైయారా’ చిత్రంతో<<>> సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలీ అబ్బాస్ డైరెక్షన్‌లో రొమాంటిక్ యాక్షన్ మూవీలో నటించనున్నారు. ఇందులో అహాన్ ప్రేమ కోసం పోరాడే గ్యాంగ్‌స్టర్ రోల్ పోషిస్తారని సమాచారం. ప్రస్తుతం వెపన్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శార్వరీ వాఘ్ నటిస్తారని టాక్.


