News January 22, 2026
గ్రీన్ క్లైమేట్ ఫండ్‌తో మత్స్యకారులకు అండ: కలెక్టర్

గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలో నిర్వహించిన సమీక్షలో అలంకార చేపలు, పీతల పెంపకం, సముద్ర నాచు యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా మత్స్య సంపద పెంపుదల, ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 3, 2026
గన్నవరం: విద్యార్థులకు గుడ్ న్యూస్

వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులకు శుభవార్త. గన్నవరంలో నూతన ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హాస్టల్ సౌకర్యాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక విద్య, పరిశోధనలకు ఇక్కడ పెద్దపీట వేయనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.
News February 3, 2026
కృష్ణా జిల్లా రైతుల్లో కలవరం..!

కృష్ణా జిల్లాలో అపరాల సాగు కీలక దశకు చేరుకోగా, ఎలుకల బెడద రైతులను వణికిస్తోంది. పూత, కాయ దశలో ఉన్న పంటను మూషికాలు కొరికి నాశనం చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణ చర్యల కోసం గతంలో కంటే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి, ఎలుకల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
News February 3, 2026
కృష్ణా: ఈ నెల 16 వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజు గడువు

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4, 6వ సెమిస్టర్‌కు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులపై వర్సిటీ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఈ నెల 16వ తేదీ లోపు తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. అనంతరం 17వ తేదీ వరకు ప్రిన్సిపల్స్ యూనివర్సిటీ పోర్టల్‌లో ఫీజును జమ చేయాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో 21, 24, 27 తేదీల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.


