News January 6, 2025
గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి: జేసీ

గ్రీవెన్స్‌కు వచ్చే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ఆదోనిలోని సబ్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలపై నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఆయా శాఖల పరిధిలో ఉన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
Similar News
News December 14, 2025
కర్నూలు క్రీడాకారులను ఢిల్లీలో అభినందించిన ఎంపీ

న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను ఎంపీ నాగరాజు ఆదివారం అభినందించారు. అండర్-19 విభాగంలో పాల్గొంటున్న హేమలత, అండర్-17 విభాగంలో పాల్గొంటున్న శృతి, సిరి చేతన రాజ్, లహరి ఢిల్లీలో ఎంపీని కలిశారు. వారు పాల్గొంటున్న ఈవెంట్ల గురించి ఎంపీ అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
News December 14, 2025
కబడ్డీలో కర్నూలు బాలికలకు మూడో స్థానం

పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో కర్నూలు జిల్లా బాలికల జట్టు మూడో స్థానం సాధించింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ అభినందించారు. జట్టులోని ఇందు, లలిత, ప్రశాంతి విశాఖపట్నంలో జరిగే జాతీయ స్థాయి శిక్షణా శిబిరానికి ఎంపికయ్యారు.
News December 14, 2025
లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.


