News March 31, 2025
గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.
Similar News
News April 2, 2025
FREE బస్సు.. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో ఇదీ పరిస్థితి..!

ఫ్రీ బస్సు కారణంగా తాము బస్సు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పురుషులు మంగళవారం వాపోయారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వచ్చిన బస్సులన్నింటిలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం సెలవు, బుధవారం వర్కింగ్ డే కావడంతో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.
News April 2, 2025
గ్యాంగ్ రేప్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

ఊరుకొండ పేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మహిళల భద్రత అంశం ఆందోళన కలిగిస్తోందని BRS నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేర స్థలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కాగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
News April 1, 2025
NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.