News September 26, 2025
గ్రూప్-1లో డీఎస్పీగా మెదక్ యువతి

మెదక్‌కు చెందిన దొంత నిశ్రిత గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసి 502.5 మార్కులతో 47వ ర్యాంకు సాధించింది. డీఎస్పీ ఉద్యోగం సాధించడంపై నిశ్రితకు కుటుంబ సభ్యులు, బంధువులు, పట్టణవాసులు అభినందనలు తెలిపారు.
నిశ్రిత తండ్రి నరేందర్ మెదక్ జిల్లా టీఎంజీఓ అధ్యక్షుడిగా ఉన్నారు.
Similar News
News October 24, 2025
మెదక్: సర్పంచులు లేక మరుగునపడుతున్న గ్రామాలు!

మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు సర్పంచులు లేక పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. గ్రామంలో చిన్న సమస్యను చెప్పడానికి గ్రామానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే.. అయిన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తే కోర్టులు ఎన్నికలను నిలిపివేశాయి. గ్రామాల్లో నియమించిన స్పెషల్ ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
News October 24, 2025
మెదక్ జిల్లాలో 1420 మద్యం దరఖాస్తులు

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాల కోసం 1420 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పోతంశెట్టిపల్లి దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం సమయం పొడిగించడంతో 33 దరఖాస్తులు పెరిగాయి. మెదక్ సర్కిల్లో 17 దుకాణాలకు 513, నర్సాపూర్ సర్కిల్లో 17 దుకాణాలకు 519, రామాయంపేట సర్కిల్లో 15 దుకాణాలకు 388 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.42.60 కోట్ల ఆదాయం చేకూరింది.
News October 24, 2025
మెదక్: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HMలకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


