News March 31, 2025

గ్రూప్-1లో మంథని యువకుడికి 114వ ర్యాంకు

image

మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 114వ, మల్టీ జోన్-1 స్థాయిలో 64వ ర్యాంక్ సాధించాడు. 2018లో ట్రిపుల్ ఐటీ జబల్‌పూర్‌లో బీటెక్(సీఈసీ) పూర్తిచేశాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్, గ్రూప్-3లో రాష్ట్రస్థాయిలో 81వ ర్యాంక్ సాధించాడు.

Similar News

News April 2, 2025

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

image

TG: రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సరుకుల కిట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుందని సమాచారం. గతంలో ‘అమ్మహస్తం’ పేరుతో కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, కారంపొడి, పసుపు, కిరోసిన్ అందజేసింది.

News April 2, 2025

14వేల ఎకరాల భూమి ఉన్నా ఈ వినాశనం ఎందుకు?: కేటీఆర్

image

TG: ఫ్యూచర్ సిటీకి భూమి అందుబాటులో ఉన్నా విలువైన పర్యావరణాన్ని వినాశనం చేయడం ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ Xలో ప్రశ్నించారు. ‘ఫ్యూచర్ సిటీ’లో ఐటీ పార్కులు, ఆర్థిక కార్యకలాపాల కోసం 14వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రస్తుత నగరాన్ని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని హాష్‌ట్యా‌గ్‌ ఇచ్చారు.

News April 2, 2025

అనంతసాగరం: ఈతకెళ్లి యువకుడి మృతి.. జరిగిందిదే..!

image

అనంతసాగరం, మినగల్లుకు చెందిన మస్తాన్ బాష ఈతకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం స్నేహితులతో ఉత్తర కాలువలోకి వెళ్లాడు. ప్రవాహం అధికంగా ఉండడంతో..కొట్టుకుపోయాడు. సమాచారమందుకున్న పేరెంట్స్ గాలించినా దొరకకపోవడంతో..పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం ఉదయం గాలించగా..నన్లరాజుపాలెం సమీపంలో డెడ్ బాడీ లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.

error: Content is protected !!