News March 13, 2025

గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

image

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.

Similar News

News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

News March 13, 2025

ఇంటర్ పేపర్లలో తప్పులు.. విద్యార్థుల ఆందోళన

image

TG: ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సెకండియర్ బోటనీలో 2, గణితంలో ఒక తప్పు, మంగళవారం ఫస్టియర్ పేపర్లలో 3 సబ్జెక్టుల్లో 6 తప్పులు దొర్లాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ అస్పష్టంగా ముద్రించడంతో ఏడో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తామని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.

News March 13, 2025

బాపట్ల: మృతురాలి వివరాలు గుర్తింపు

image

బాపట్ల పట్టణంలో లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. బాపట్ల పట్టణ ఎస్ఐ చంద్రావతి పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన శేషమ్మగా గుర్తించినట్లు బాపట్ల పట్టణ ఎస్ఐ చంద్రావతి తెలిపారు. మృతురాలు తన కూతురు వద్దకు వెళుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!