News March 31, 2025

గ్రూప్-1లో సత్తాచాటిన సంస్థాన్ నారాయణపురం ఏఓ

image

సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి కే. వర్షిత గ్రూప్-1లో సత్తాచాటారు. నాలుగు నెలల క్రితం ఏఓగా భాద్యతలు చేపట్టిన వర్షిత గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంక్, మల్టీజోన్-2లో 40 ర్యాంకు సాధించారు. ఇటీవలే ప్రకటించిన గ్రూప్-4లో 143, గ్రూప్-2లో 215వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటారు. ఈ జాబ్స్ అన్నీ మొదటి ప్రయత్నంలోనే సాధించడం విశేషం.

Similar News

News November 15, 2025

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి: కలెక్టర్

image

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్‌లకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ రిసార్ట్‌లు బాగా అభివృద్ధి చెందాయని, పరిసరాలను ఎల్లవేళలా పరిశ్రమంగా ఉంచి, పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా జిల్లాకు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుందని తద్వారా జీడీపీ రేటు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 15, 2025

మూవీ ముచ్చట్లు

image

* Globetrotter ఈవెంట్‌లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె

News November 15, 2025

భూపాలపల్లి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల, గణపురం(ములుగు), మల్హర్‌రావు, మహాముత్తారం, పలిమెల, టేకుమట్ల, మహదేవ్‌పూర్ నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.