News July 7, 2024
గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన తండ్రి, కొడుకులు

ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవి కిరణ్, ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానుయేల్ ఇద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. రవి కిరణ్ కామేపల్లిలోని ఎంజేపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.
Similar News
News February 4, 2026
ఫర్టిలైజర్ యాప్‌తో సజావుగా యూరియా పంపిణీ: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జనవరి 29 నుంచి నిన్నటి వరకు 25,252 మంది రైతులు యాప్ ద్వారా 1,08,721 యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, 87,350 సంచులు కొనుగోలు చేశారు. రైతులు పంట, విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సొసైటీల్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాప్ ద్వారా క్యూలైన్లు లేకుండా సమయం ఆదా అవుతోందన్నారు.
News February 4, 2026
ఖమ్మం జిల్లాకు 1,517 టన్నుల యూరియా

ఖమ్మం జిల్లా రైతుల కోసం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 1,517.16 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరుకుంది. ఏఓ పవన్‌కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. సాగు అవసరాలకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
News February 4, 2026
విద్యా పరిపాలనపై శిక్షణ.. గుజరాత్‌కు ఖమ్మం డీఈఓ!

ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) చైతన్య జైనీ వృత్తిపరమైన శిక్షణ కోసం గుజరాత్ వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు విద్యా నిర్వహణ, ఆధునిక విధానాలపై జరిగే ప్రత్యేక తరగతుల్లో ఆమె పాల్గొంటారు. ఆమె గైర్హాజరీలో డీఈఓ కార్యాలయ ఏడీ చావా శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణలే లక్ష్యంగా ఈ శిక్షణ సాగనుంది.


