News April 1, 2025

గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటిన నారాయణపేట బిడ్డ

image

నారాయణపేట జిల్లా కేంద్రం యాదవనగర్‌కు చెందిన వీణ గ్రూప్ 1 ఫలితాలలో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంక్, ఎస్టీ కేటగిరిలో మల్టీ జోన్-2 లో మూడో ర్యాంక్ సాధించింది. ఆమె మొదట 2024లో గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఎంపికైంది. 2025లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ప్రస్తుతం గోల్కొండ మహిళా కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 

Similar News

News April 3, 2025

వనపర్తి: ‘ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని పునః సమీక్షించండి’

image

ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని(AEBAS) తక్షణమే పునః సమీక్షించాలని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇతర ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని అనుమతించాలని కోరుతూ గురువారం వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల వాస్తవ సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

News April 3, 2025

జనగాం యువతకు కలెక్టర్ సూచనలు

image

యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగించుకోవాలన  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రంలో అందజేయాలన్నారు.

News April 3, 2025

APకి రండి.. ‘OPEN AI’ సీఈవోకు చంద్రబాబు ఆహ్వానం

image

AI వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తుందని ‘OPEN AI’ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ‘AIని అందిపుచ్చుకోవడంలో భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ AI-ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు అమరావతిని సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీతో మా విజన్‌ను పంచుకుంటాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

error: Content is protected !!