News February 1, 2026

గ్రూప్-1 లో సత్తా చాటిన మద్దిపాడు MPDO

image

తాళ్లూరు మండలం తూర్పు గంగవరం చెందిన వల్లభనేని జ్యోతి S/O వల్లభనేని సుబ్బయ్య (నాగం బొట్లపాలెం సొసైటీ చైర్మన్) గ్రూప్-1లో సత్తా చాటారు. మద్దిపాడు మండలం MPDO గా విధులు నిర్వహిస్తున్న ఆమె గ్రూప్ వన్ రిజల్ట్స్‌లో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. పలువురు గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Similar News

News February 3, 2026

ప్రకాశం: యాక్సిడెంట్.. విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

News February 3, 2026

ఒక్క మాటతో IPS.. కనిగిరి వాసి సక్సెస్ స్టోరీ..!

image

“నా తర్వాతి సివిల్స్ విజేత ఇతనే” అని పదేళ్లక్రితం IPS ఆవుల రమేశ్‌‌రెడ్డి ఓ వేదికపై చెప్పినమాట అక్షర సత్యమైంది. పవన్ కుమార్‌ రెడ్డి 179వ ర్యాంకుతో ఆంధ్రాలో IPSకు ఎంపికయ్యారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే నాలుగో ప్రయత్నంలో IPS సాధించారు. డాక్టర్ అవ్వాలనుకున్న ఈయన IPS రమేశ్ రెడ్డి ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించారు.

News February 3, 2026

ప్రకాశం: అరుదైన అవార్డు అందుకున్న డీడీ డా.జగత్ శ్రీనివాస్

image

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్‌కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.