News January 28, 2026
గ్రూప్ -2లో ప్రకాశం వాసుల ప్రతిభ

గ్రూప్ -2 ఫలితాలలో ప్రకాశం జిల్లా వాసులు సత్తా చాటారు. CS పురానికి చెందిన నవీన్ యాదవ్ వెలిగండ్లలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహశీల్దార్‌గా ఎన్నికయ్యారు. అలాగే కనిగిరికి చెందిన మహమ్మద్ సమీర్ టీచర్ పని చేస్తూ.. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వీరి విజయం కుటుంబంలో సంతోషాన్ని నింపుతోంది.
Similar News
News February 7, 2026
ప్రకాశం: పొగాకు బోర్డు అధికారి ట్రాన్స్‌ఫర్

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.
News February 7, 2026
మార్కాపురం: కోరిక తీర్చలేదని చంపేశాడు..!

పొదిలి(M) గోగినేనివారిపాలెంలో గత నెల 18న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుల్లెమ్మ(49) భర్త చనిపోగా ఒంటరిగా ఉంటోంది. అదే ఊరికి చెందిన ఏడుకొండలుకు చాలామంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్యకు బుల్లెమ్మ చెప్పింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. బుల్లెమ్మపై పగ పెంచుకున్న ఏడుకొండలు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని అడగ్గా.. ఒప్పుకోలేదు. దీంతో మెడకు తాడు బిగించి చంపేశాడు.
News February 7, 2026
సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.


