News March 12, 2025
గ్రూప్-2లో ర్యాంక్ సాధించిన మహబూబాబాద్ SI

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ గ్రూప్-2 ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో యువకులు సత్తా చాటారు. పట్టణంలో టౌన్ ఎస్ఐగా పని చేస్తున్న శివకుమార్ స్టేట్ వైడ్ 25వ ర్యాంకు సాధించి మహబూబాబాద్‌లో టాప్‌గా నిలిచారు. ఓవైపు ఎస్ఐగా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలకు చదివి టాప్ ర్యాంక్ సాధించడంతో జిల్లాలోని పలువురు ఎస్సై శివకుమార్‌ను అభినందిస్తున్నారు.
Similar News
News March 12, 2025
నెల్లూరు: ‘ప్లాన్ తయారు చెయ్యడంలో శ్రద్ధ తీసుకోండి’

నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్‌ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.
News March 12, 2025
మల్దకల్లో 37 9°c ఉష్ణోగ్రతలు నమోదు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రేపటి నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 37 9°c, గద్వాల్లో 37.3°c, అలంపూర్‌లో 37.1°c, సాతర్లలో 36.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 12, 2025
రాజమండ్రి: 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’

స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 27,441 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం కింద ఎస్సీ, బిసీలకు రూ.50,000/- & ఎస్టీలకు రూ.75,000 అందజేయనున్నట్లు వెల్లడించారు.