News December 15, 2024
గ్రూప్ 2 ఎగ్జామ్: HYDలోని లైబ్రరీలు ఖాళీ

గ్రూప్ 2 ఎగ్జామ్‌తో HYDలోని లైబ్రరీలు, స్టడీ హాల్స్ వెలవెలబోయాయి. ఎప్పుడూ విద్యార్థులతో కళ కళలాడే చిక్కడపల్లి లైబ్రరీ ఖాళీగా దర్శనమిచ్చింది. రేపు కూడా పరీక్ష ఉంది. తమ సొంత జిల్లాలోనూ సెంటర్లు ఉండడంతో అభ్యర్థులు ఒకరోజు ముందే ప్రయాణమయ్యారు. ఈ ప్రభావంతో అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర కోచింగ్ సెంటర్ల వద్ద హడావిడి తగ్గింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Similar News
News February 25, 2026
HYD: మీకూ ఈ లక్షణాలు ఉన్నాయా? జాగ్రత్త!

మనిషిని కుంగదీస్తున్న మానసిక రోదన వెనక అనేక కారణాలు ఉన్నాయని మేడిపల్లి డా.సుప్రజ తెలిపారు. మనసు విశ్రాంతిని, మార్పును కోరుకుంటోందని చెప్పే సంకేతం. నీరసం, చిన్నదానికే కోపం, కన్నీళ్లు, నలుగురిలోకి వెళ్లలేకపోవడం లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, SM వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఫోన్లు దూరంపెట్టి నచ్చిన పనిచేస్తే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయన్నారు.
News February 25, 2026
HYD: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 1,75,271 మంది విద్యార్థులు 217 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తారు. 1st ఇయర్‌లో 81,898 మంది, 2nd ఇయర్‌లో 93,373 మంది ఉన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు CC రూమ్‌కు అనుసంధానించారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
News February 24, 2026
Trending: HYDలో అంతాక్షరీ 2.O!

చిన్నప్పుడు మనం ఫ్రీగా ఆడిన అంతాక్షరీ ఇప్పుడు ‘మ్యూజికల్ జామింగ్’ (Musical Jamming) పేరుతో కొత్త రూపం దాల్చింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ కేఫ్స్‌లో వారాంతాల్లో ఈ సెషన్స్ జరుగుతున్నాయి. దీనికోసం జెన్-జీ కుర్రాళ్లు ఒక్కొక్కరు రూ.499 నుంచి రూ.999 వరకు టికెట్ కొని మరీ వెళ్తున్నారు. పాత పాటలకే కొత్త ట్యూన్లు కట్టి, చప్పట్లు కొడుతూ పాడటమే ఈ ‘పెయిడ్ అంతాక్షరి’ స్పెషాలిటీ. పాత ఆటకి కార్పొరేట్ రేట్ పడింది.


