News December 14, 2024

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: రామగుండం CP

image

డిసెంబర్ 15, 16 తేదీలలో జరగనున్న గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో ఉంటుందని ఈ రోజు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 23,969 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని.. అందులో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలలో 9018, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలలో 14,951 మంది హాజరు కానున్నారన్నారు.

Similar News

News February 20, 2026

TGRSA కరీంనగర్ డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

image

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

News February 20, 2026

కరీంనగర్: మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రెండు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించిందని జిల్లా మైనారిటీ అధికారి వి.జగదీశ్వర్ తెలిపారు. tgobmms పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ. 1.50లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.20 లక్షల సబ్సిడీ, ముస్లిం బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారికి రూ. 60వేల యూనిట్ విలువతో పథకం అమలు చేస్తున్నామన్నారు. కలెక్టరేట్ లోని 108 రూంలో సంప్రదించాలన్నారు.

News February 20, 2026

KNR: ‘మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావాలి’

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ స్కూల్ ఆవరణలోని జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం మ్యూజియం పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మ్యూజియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.