News January 27, 2026

గ్రూప్‌-2 ఫలితాలకు మోక్షం ఎప్పుడో?

image

AP: గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 2023 DECలో 905 పోస్టులతో నోటిఫికేషన్‌ రాగా, ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా తుది ఫలితాలు విడుదల చేయలేదు. కోర్టు కేసులు, రోస్టర్‌, స్పోర్ట్స్ కోటా అంశాలు అడ్డంకులుగా మారాయి. ఇటీవల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా APPSC నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మళ్లీ కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.

Similar News

News February 12, 2026

జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

image

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.

News February 12, 2026

విజయ్ మాల్యా INDకు వస్తేనే పిటిషన్‌ను విచారిస్తాం: హైకోర్టు

image

తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ <<17636225>>విజయ్ మాల్యా<<>> దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని విచారించాలంటే ఆయన ఇండియాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా కోర్టుకు హాజరుకాని వ్యక్తులు ఉపశమనం కోరలేరు. ఈ పిటిషన్‌ను కొట్టేయకుండా మరో అవకాశమిస్తున్నాం. ఆయన వస్తారో లేదో పేర్కొంటూ అఫిడవిట్ వేయండి’ అని సూచిస్తూ FEB 18కి వాయిదా వేసింది.

News February 12, 2026

నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

<>నార్త్ <<>>ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌ 11 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 5, 6తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech రిమోట్ సెన్సింగ్& GIS, జియోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్, BE/BTech, NET/ GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ సైంటిస్ట్‌కు నెలకు రూ.56,100, JRFకు రూ. 37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: nesac.gov.in