News March 12, 2025
గ్రూప్-2 ఫలితాల్లో కాసింపల్లి వాసికి 76వ ర్యాంకు

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్ రాష్ట్ర స్థాయి 76వ ర్యాంక్ సాధించి కాళేశ్వరం జోన్ టాపర్‌గా నిలిచాడు. గతంలో పంచాయతీ సెక్రటరీగా, వీఆర్ఓగా, గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్‌గా 4 ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం పదోన్నతి పొంది హైదరాబాదులో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు.
Similar News
News July 9, 2025
జనగామ: ఇది.. మా ఇంటి ఇంకుడు గుంత: కలెక్టర్

భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జిల్లాలో ”మన జిల్లా- మన నీరు ” కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. ఈ చక్కటి కార్యక్రమంలో కలెక్టరే పలుగు, పార పట్టి ఇంకుడు గుంతను తవ్వారు. బాధ్యతతో మా ఇంట్లో ఇంకుడుగుంతను నిర్మించా.. మీరు సైతం మీ ఇళ్లల్లో ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
News July 9, 2025
జూన్‌లో SIPs ఇన్వెస్ట్‌మెంట్స్ రికార్డు

జూన్ నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(SIPs)లో పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మేలో రూ.26,688 కోట్ల ఇన్‌ఫ్లో ఉండగా జూన్‌లో రూ.27,269 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. మొత్తం SIP అకౌంట్లు 90.6 మిలియన్ల నుంచి 91.9 మిలియన్లకు పెరిగాయని వెల్లడించింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్స్ జూన్‌లో రూ.74 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.
News July 9, 2025
వరంగల్: రేపు భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి మాత శాకాంబరీ ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. 14 రోజుల పాటు భద్రకాళి మాత వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చింది. చివరిరోజైన గురువారం వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.