News February 22, 2025
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: కలెక్టర్

నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు.
Similar News
News February 23, 2025
నెల్లూరు:‘ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించండి’

మార్చి 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ అన్నారు. శనివారం డీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల శిక్షణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్ఐఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 53,200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు.
News February 23, 2025
శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

నెల్లూరు నగరం దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామిని దర్శించారు. అనంతరం అమ్మవారికి నవావరణ పూజ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
News February 22, 2025
నెల్లూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

✒ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: నెల్లూరు కలెక్టర్
✒ త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు: మంత్రి నాదెండ్ల
✒ కందుకూరు: RTCబస్‌లోనే అనంత లోకాలకు
✒ నెల్లూరులో 40 కిలోల వెండి స్వాధీనం
✒ బుచ్చి గోదాములో మంత్రుల తనిఖీలు
✒ నెల్లూరు: మహిళా అధికారుల ఫైట్ (వీడియో)
✒ నెల్లూరు జిల్లా ఎస్పీ హెచ్చరిక
✒ కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు
✒ నెల్లూరు: వెబ్ సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు